పూరితో పవన్.. వర్కౌట్ అయ్యేనా?


పూరితో పవన్.. వర్కౌట్ అయ్యేనా?
పూరితో పవన్.. వర్కౌట్ అయ్యేనా?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెల్సిందే. ఈ సినిమాలో నువ్వు నంద అయితే ఏంటి నేను బద్రి బద్రీనాథ్.. అని చెప్పే డైలాగ్ ఒక ఐకానిక్ మూమెంట్ గా నిలిచిపోయింది. ఆ సినిమా విజయం సాధించినా మళ్ళీ పూరి జగన్నాథ్, పవన్ కళ్యాణ్ కలిసి పనిచేయడానికి చాలా ఏళ్ళు పట్టింది. కెమేరామ్యాన్ గంగతో రాంబాబు సినిమాతో అది కుదిరినా ఆ సినిమా నిరాశపరిచింది.

ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇద్దరి కాంబినేషన్ కుదర్లేదు. చూస్తుంటే వచ్చే ఏడాది ఈ కాంబినేషన్ సెట్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి పవర్ఫుల్ స్పీడ్ తో దూసుకుపోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పింక్ రీమేక్ షూటింగ్ ను సగం పూర్తి చేసాడు. క్రిష్ తో సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టి ఒక షెడ్యూల్ ను ఫినిష్ చేసాడు. ఇక ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో హరీష్ శంకర్ సినిమాను కూడా మొదలుపెట్టబోతున్నాడు. ఈ సినిమాలు అన్నీ వచ్చే ఏడాదికి విడుదలైపోతాయి.

2023 ఎన్నికల్లో మళ్ళీ బిజీ అయ్యే పవన్ కళ్యాణ్ దానికి ఏడాది ముందు నుండీ మళ్ళీ సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఏడాదికి మూడు సినిమాలు చొప్పున విడుదల చేసి అటు ఫైనాన్షియల్ గా కొంచెం స్ట్రాంగ్ అవ్వాలని చూస్తున్నాడు. ఈ ఏడాదే మరో రెండు సినిమాలకు ఓకే చెప్పే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఉండే అవకాశముంది.

పవన్ తో సినిమా చేసే అవకాశమొస్తే పూరి వదులుకోడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమాను తీస్తున్న పూరి, ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ తో బౌన్స్ బ్యాక్ అయిన విషయం తెల్సిందే. ఆ విజయం గాలివాటం కాదని నిరూపించుకోవడానికి విజయ్ దేవరకొండ సినిమాను హిట్ చేయాలి. అది కనుక హిట్ అయితే పవన్ కళ్యాణ్ తో పనిచేసే అవకాశం వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి.