పవన్ కళ్యాణ్ మరో డీల్


pawan kalyan turned host for english news channel

గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కి తెలుగుదేశం పార్టీ కి మద్దతు పలికినందుకు భారీ డీల్ కుదిరిందని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది కట్ చేస్తే ఇప్పుడు కూడా మరో డీల్ కుదుర్చుకున్నట్లు గుసగుసలు మొదలయ్యాయి . అయితే మొదటిది చాలా పెద్ద డీల్ కాగా ఇప్పటిది మాత్రం ఆ స్థాయి కాదు . ఆంధ్రప్రభ పత్రిక తాజాగా ఓ ఇంగ్లీష్ ఛానల్ ని ఇండియా ఎ హెడ్ పేరుతో ప్రారంభిస్తోంది . త్వరలోనే ప్రసారాలు ప్రారంభం కానున్న ఈ ఛానల్ న్యూస్ ఛానల్ కావడంతో పవన్ కళ్యాణ్ చేత ఓ సామాజిక కార్యక్రమం చేపట్టాలని భారీ డీల్ కుదుర్చుకున్నారట .

జనసేన పేరుతో ఎలాగూ రాజకీయ పార్టీ ఉంది అలాగే ఎన్నికలు కూడా మరో 7 నెలల సమయం మాత్రమే ఉంది దాంతో ఈ ఛానల్ ని ఉపయోగించు కోవాలని పవన్ కూడా నిర్ణయానికి వచ్చాడట . పవన్ కళ్యాణ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నందుకు భారీ మొత్తం ఇవ్వడానికి ముందుకు వచ్చారట సదరు ఛానల్ నిర్వాహకులు . ఇక ముత్తా గోపాలకృష్ణ అండ్ సన్స్ జనసేన పార్టీలో చేరుతున్నారు . ముత్తా గోపాలకృష్ణ వ్యాపారవేత్త మాత్రమే కాదు మాజీ ఎం ఎల్ ఏ కూడా దాంతో మళ్ళీ రాజకీయాల్లో జనసేన తరుపున ఓ వెలుగు వెలిగిపోవాలని భావిస్తున్నాడట .

English Title: pawan kalyan turned host for english news channel