ఏబీఎన్ రాధాకృష్ణ పై సెటైర్ వేసిన పవన్


pawan kalyan tweet on abn radhakrishna పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడా తగ్గడం లేదు తనని టార్గెట్ చేసిన మీడియా అధినేతలను అదే స్థాయిలో టార్గెట్ చేస్తున్నాడు . ఇప్పటికే రవిప్రకాష్ కి సంబందించిన ఓ వీడియో ని లీక్ చేసిన పవన్ తాజాగా ఏబీఎన్ రాధాకృష్ణ పై ఘాటు విమర్శలు చేస్తూ ట్వీట్ చేసాడు . ఇప్పుడు ఆ ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది . ఇంతకీ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఏంటో తెలుసా …… ఆర్కే …. ప్లీజ్ వెల్ కం టు బట్టలూడదీసి మాట్లాడుకుందాం …… బట్టలూడదీసి కొడదాం ” కార్యక్రమానికి మీకు స్వాగతం ”

అంతేకాదు రాధాకృష్ణ ఫోటో కూడా పెట్టి సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు పవన్ కళ్యాణ్ . దాంతో ఆ వర్గాలు రగిలిపోతున్నాయి . టివి 9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్ళు పవన్ పై చాలా ఆగ్రహంగా ఉన్నాయి . కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు . కొన్ని మీడియా సంస్థలతో యుద్దానికి సిద్ధమనే సంకేతాలు పంపిస్తున్నాడు .