ఏబీఎన్ పై ట్విట్టర్ వార్ చేస్తున్న పవన్ కళ్యాణ్


pawan kalyan twitter war on abn radhakrishna

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పై ట్విట్టర్ వార్ మొదలు పెట్టాడు . ఇప్పటికే టివి 9 వాళ్ళని టార్గెట్ చేసిన పవన్ తాజాగా ఏబీఎన్ రాధాకృష్ణ పై అదేపనిగా ట్వీట్ లు చేయడం మొదలు పెట్టాడు . కేంద్ర ప్రభుత్వాన్ని , మోడీ ని తిట్టమని తెలుగుదేశం అధినేత కు చెప్పింది ఏబీఎన్ రాధాకృష్ణే అంటూ ట్వీట్ చేసాడు . అంతేకాదు వరుస ట్వీట్ లతో గుడ్ మార్నింగ్ కూడా చెబుతున్నాడు రాధాకృష్ణ కు .

తెలుగుదేశం పార్టీ కి అండగా నిలిచిన ఈనాడు , ఆంధ్రజ్యోతి పత్రికలు గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో కూడా మాకు వ్యతిరేకంగా వార్తలు రాశాయని అప్పట్లో మెగా కుటుంబం మొత్తం విరుచుకుపడిన విషయం తెలిసిందే . కాగా ఇప్పుడేమో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి , టివి 9 , మహా టివి , టివి 5 లు జనసేన కు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయని …… వాళ్ళు ఎంతగా టార్గెట్ చేసినప్పటికీ మా ఆత్మవిశ్వాసాన్ని వదిలేది లేదని అదే స్థాయిలో ఏబీఎన్ రాధాకృష్ణ పై వరుస ట్వీట్ లు చేస్తూ విరుచుకు పడుతున్నాడు పవన్ .