`వ‌కీల్‌సాబ్` సెట్స్‌కు వ‌చ్చేది అప్పుడే?

`వ‌కీల్‌సాబ్` సెట్స్‌కు వ‌చ్చేది అప్పుడే?
`వ‌కీల్‌సాబ్` సెట్స్‌కు వ‌చ్చేది అప్పుడే?

క‌రోనా దెబ్బ‌తో ఆగిపోయిన ఇండ‌స్ట్రీ కార్య‌క‌లాపాలు మ‌ళ్లీ మొద‌లు కాబోతున్నాయి. ఇప్ప‌టికే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్రామ‌ల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డంతో టాలీవుడ్‌లో మ‌ళ్లీ సంద‌డి మొద‌లైంది. వ‌చ్చే నెల మొద‌టి వారం నుంచి షూటింగ్‌ల మొద‌లుతో టాలీవుడ్‌లో కొత్త సంద‌డి ప్రారంభం కాబోతోంది. ఇప్ప‌టికే కొన్ని చిత్రాలు ప్రారంభానికి రెడీ అవుతున్నాయి.

కొన్ని మాత్రం వేచి చూసే ధోర‌ణినే ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. జూన్ మొద‌టి వారంలో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీ స్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌` ప్రారంభం కాబోతోంది. అయితే ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌కీల్‌సాబ్‌` షూటింగ్ మాత్రం జూన్‌లో ప్రారంభం కావ‌డం లేదు. జూన్ నెలాఖ‌రు లేదా… జూలై ప్ర‌ధ‌మార్థం లో ప్రారంభించాలని. ప‌రిస్థితిని గ‌మ‌నించి ఓ అంచ‌నాకు ఇచ్చిన త‌రువాతే షూటింగ్‌కి వెళ్లాల‌ని భావిస్తున్నారు.

బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ క‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్‌గా క‌నిపించ‌నున్న విష‌యం తెలిసిందే. కీల‌క పాత్ర‌ల్లో లావ‌ణ్య త్రిపాఠి, అంజ‌లి, నివేదా థామ‌స్ న‌టిస్తున్నారు.