పింక్ రీమేక్.. పవన్ స్టేటస్ ఏంటి?


Pawan Kalyan vakeel saab shooting updates
పింక్ రీమేక్.. పవన్ స్టేటస్ ఏంటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. రీ ఎంట్రీ కోసం బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ చిత్ర రీమేక్ లో నటించాలని డిసైడ్ అయ్యాడు. రెండు వారాల క్రితం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న పవన్, అప్పటినుండి నాన్ స్టాప్ గా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నా సరే పింక్ రీమేక్ షూటింగ్ ను కూడా కొనసాగించాడు పవన్. అయితే మరోవైపు క్రిష్ సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టిన పవన్, ఇప్పుడు రెండు సినిమాల షూటింగ్ లకు 5 రోజుల విరామం ఇవ్వనున్న సంగతి తెల్సిందే. రాజకీయాల కారణమా కర్నూల్ లో మీటింగ్, అమరావతిలో రైతులతో సమావేశం కారణంగా పవన్ ఈ బ్రేక్ తీసుకోనున్నాడు.

అయితే పింక్ రీమేక్ షూటింగ్ లో నాన్ స్టాప్ గా పాల్గొన్నాడు సరే, ఇంతకీ షూటింగ్ అప్డేట్ ఏంటి అంటే.. దాదాపు పవన్ తన పోర్షన్ లో 40 శాతం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు పవన్ కేవలం 28 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడు. అందులో రెండు వారాలు షూటింగ్ పూర్తయింది. ఈ సమయంలో 40 శాతం పోర్షన్ ను పూర్తి చేసాడట. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ మొదలవుతుంది. ఆ షెడ్యూల్ పవన్ తన పార్ట్ మొత్తాన్ని పూర్తి చేస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం యూనిట్ సభ్యులు ఆ షెడ్యూల్ కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందులో పవన్ లాయర్ గా కనిపించనుండగా సినిమాకు వకీల్ సాబ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నాడు. వకీల్ సాబ్ కు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలుస్తాయి. ఈ రెండు చిత్రాలు కాకుండా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను కమిట్ అయిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.