సైరా నరసింహారెడ్డి లో పవన్ కళ్యాణ్


Pawan Kalyan Voice Over for Sye Raa Narasimha Reddy
Pawan Kalyan Voice Over for Sye Raa Narasimha Reddy

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఉన్నాడట ! వినడానికి ఇది ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ నిజమే అని అంటున్నారు . అయితే సైరా నరసింహారెడ్డి చిత్రంలో పవన్ కళ్యాణ్ నటించలేదు కానీ ఈరోజు మేకింగ్ వీడీయో మరికొద్ది సేపట్లో విడుదల కానుంది కాగా ఆ మేకింగ్ వీడియో కు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడని సమాచారం .

ఇది నిజమే అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు మెగా ఫ్యాన్స్ అందరికీ పెద్ద పండగే అని చెప్పాలి . జనసేన అంటూ రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ మళ్ళీ నటించాలని అభిమానులు ఆరాటపడుతున్నారు . సినిమాల్లో నటించను అని చెప్పాడు కానీ వాయిస్ ఓవర్ ఇస్తే మాత్రం మెగా ఫ్యాన్స్ కు పూనకం వచ్చినట్లే ! అయితే పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చాడా ? లేదా ? అన్నది మరికొద్ది సేపట్లోనే తేలనుంది .