పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ వీడియో వైరల్


Pawan Kalyan Voice Over For Sye Raa Teaser
Pawan Kalyan Voice Over For Sye Raa Teaser

సైరా నరసింహారెడ్డి చిత్రానికి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడమే సంచలనం అనుకుంటే దాని తాలూకు వీడియో రిలీజ్ చేయడం మరింత సంచలనం సృష్టిస్తోంది . దాంతో మెగా ఫ్యాన్స్ ఆ వీడియో పై దాడి చేస్తున్నారు . మెగా ఫ్యాన్స్ దాడి అనగానే మరోరకమైన దాడి అనుకోవద్దు ఈ వీడియో ని ఎక్కువగా వీక్షిస్తున్నారు మెగా ఫ్యాన్స్ . అన్నయ్య చిత్రానికి తమ్ముడు వాయిస్ ఓవర్ ఇవ్వడం తో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అంతేలేకుండాపోయింది .

సైరా నరసింహారెడ్డి ఉయ్యవలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే . చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా నటిస్తుండగా మెగా కుటుంబానికి చెందిన నిహారిక కూడా చిన్న పాత్రలో కనిపించనుంది . ఇకవైపు చిరంజీవి హీరో , రాంచరణ్ నిర్మాత , పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ , నిహారిక గెస్ట్ అప్పియరెన్స్ అలాగే చిరు కూతురు సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ ఇలా మెగా ఫ్యాన్స్ కు కేక పెట్టించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి ఇందులో .