రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కల్యాణ్


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జనసేన తరుపున భీమవరం , గాజువాక అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసాడు. ఈ రెండు స్థానాల్లో కూడా తప్పకుండా గెలుస్తానని భావించి పోటీ చేసాడు. పోటీ చేయడానికి ముందు సర్వే చేసుకొని మరీ పోటీకి దిగాడు కానీ ఎన్నికల ఫలితాలు వచ్చాక పవన్ కల్యాణ్ తో పాటుగా పవన్ ఫ్యాన్స్ కు కూడా దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు.

సినిమాలను పక్కన పెట్టి రాజకీయాల్లో మార్పు కోసం అంటూ వచ్చిన పవన్ కల్యాణ్ జనసేన తరుపున 80 స్థానాల్లో పోటీకి నిలిపాడు . అయితే కొంతమంది అభ్యర్థులు మధ్యలోనే చేతులు ఎత్తేశారు ఓటమి భయంతో . మిగతా అభ్యర్థుల విషయాన్ని పక్కన పెడితే పవన్ కల్యాణ్ కనీసం ఒక్క స్థానంలో నైనా గెలుస్తాడు అని అనుకున్నారు పవన్ ఫ్యాన్స్. కానీ భీమవరంలో ఓడిపోవడం , గాజువాక లోను ఓటమి దిశగా సాగుతుండటంతో పవన్ రాజకీయాలలోకి వచ్చి పెద్ద తప్పు చేశాడని వాపోతున్నారు పవన్ అభిమానులు, రాజకీయ విశ్లేషకులు.