స్వీయ నిర్భంధంలోకి ప‌వ‌న్ డైరెక్ట‌ర్‌!

స్వీయ నిర్భంధంలోకి ప‌వ‌న్ డైరెక్ట‌ర్‌!
స్వీయ నిర్భంధంలోకి ప‌వ‌న్ డైరెక్ట‌ర్‌!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇటీవ‌ల కోవిడ్ బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న శంక‌ర్ ప‌ల్లిలోని ఫామ్ హౌస్‌లో డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి మెరుగుప‌డింద‌ని తెలిసింది. ప‌వ‌న్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.

ఇదిలా వుంటే ఆయ‌న డైరెక్ట‌ర్ సాగ‌ర్ చంద్ర తాజాగా కోవిడ్ బారిన ప‌డ్డారని తెలిసింది. కోవిడ్ ల‌క్ష‌ణాలు లేకున్నా సాగ‌ర్ చంద్ర మైల్డ్ సిమ్ట‌మ్స్ వుండ‌టంతో స్వీయ నిర్భంధంలోకి వెళ్లిన‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం సాగ‌ర్ చంద్ర మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషొయుమ్‌` ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో పాటు ఇందులో రానా ద‌గ్గుబాటి కూడా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్ర‌మ్ మాట‌లు, స్క్రీన్‌ప్లే అందిస్తున్న విష‌యం తెలిసిందే. ఐశ్వ‌ర్యా రాజేష్ ఓ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీలో ప‌వ‌న్‌కు జోడీగా నిత్యామీన‌న్ న‌టించ‌బోతోది.