పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం


జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు . సినిమాల్లో సంచలనాలను సృష్టించిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మాత్రం ఘోర పరాభవం ఎదుర్కొన్నారు . ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా వెనుకబడి ఉన్నాడు .

జనసేన తరుపున 80 స్థానాలకు పైగా అభ్యర్థులను పోటీకి నిలిపాడు పవన్ కళ్యాణ్ . ఇక పవన్ కళ్యాణ్ స్వయంగా రెండు చోట్ల పోటీ చేసాడు . భీమవరం , గాజువాక స్థానాల్లో పోటీ కి దిగగా రెండు చోట్ల కూడా వెనుకంజలో ఉన్నాడు పవన్ . రాజకీయాల్లోకి వచ్చి సంచలనం సృష్టిస్తా అంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఇది ఘోర అవమానం అనే చెప్పాలి . సినిమా వేరు రాజకీయం వేరు అని మరోసారి నిరూపితమైంది . పాపం పవన్ కళ్యాణ్ కు ఘోరమైన అవమానం జరగడంతో పవన్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు .