ఏయిర్ పోర్ట్‌లో ఫొటోల‌కు చిక్కిన ప‌వ‌న్ వైఫ్‌!


ఏయిర్ పోర్ట్‌లో ఫొటోల‌కు చిక్కిన ప‌వ‌న్ వైఫ్‌!
ఏయిర్ పోర్ట్‌లో ఫొటోల‌కు చిక్కిన ప‌వ‌న్ వైఫ్‌!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మూడో కెమెరాల‌కు చిక్కింది. రేణు దేశాయ్‌తో విడిపోయిన త‌రువాత ప‌వ‌న్‌క‌ల్యాణ్ ర‌ష్య‌న్ యువ‌తి అన్నా లెజ‌నోవాని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు. అంజ‌నా ప‌వ‌నోవా, మార్క్ శంక‌ర్‌. హైద‌రాబాద్‌లో ఏయిర్ పోర్ట్‌లో ఈ ఇద్ద‌రూ త‌ల్లితో క‌లిసి సంద‌డి చేశారు. ఫొటోల‌కి చిక్కారు.

ఇటీవ‌ల త‌న త‌ల్లి అన్నా లెజ‌నోవాతో క‌లిసి క్రిస్మ‌స్ వేడుక‌ల కోసం ర‌ష్యా వెళ్లారు. ఆ కార‌ణంగానే మెగా డాట‌ర్ నిహారిక వెడ్డింగ్‌కు హాజ‌రు కాలేక‌పోయారు. కానీ క్రిస్మ‌స్ వేడుక‌ల త‌రువాతే ఇండియాకు తిరిగి వ‌స్తార‌నుకున్న అన్నా లెజ‌నోవా, అంజ‌నా ప‌వ‌నోవా, మార్క్ శంక‌ర్‌… హైద‌రాబాద్‌లో ఏయిర్ పోర్ట్‌లో దిగ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

ప్ర‌స్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తున్నాయి. ఎప్పుడూ చీర క‌ట్టుతో సంప్ర‌దాయ భార‌తీయ యువ‌తిగా క‌నిపించ‌డానికి ఇష్ట‌ప‌డే అన్నా లెజ‌నోవాల వెస్ట్ర‌న్ మ‌హిళ‌గా జీన్స్‌, టీష‌ర్ట్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌డం ప‌లువురికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఇక గ‌తంలో స్లిమ్‌గా క‌నిపించిన అన్నా లెజ‌నోవా తాజాగా ఫొటోల్లో బ‌రువెక్కి బొద్దుగా క‌నిపిస్తోంది.