వకీల్ సాబ్ ఆ విషయంలో ఎక్కడా తగ్గదట

వకీల్ సాబ్ ఆ విషయంలో ఎక్కడా తగ్గదట
వకీల్ సాబ్ ఆ విషయంలో ఎక్కడా తగ్గదట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న తాజా సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కు మెజారిటీ భాగాన్ని పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ కు ముందు విడుదలైన మగువా మగువా సాంగ్ కూడా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఈ ఒక్క పాట అనే కాదు. వకీల్ సాబ్ సంగీతం విషయంలో ఎక్కడా తగ్గదన్నట్లు తెలుస్తోంది. ఎస్ ఎస్ థమన్ మొదటిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వర్క్ చేస్తుండడంతో ఎంతో శ్రద్ధ పెట్టి మరీ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నాడట. మగువ మగువా అనే కాకుండా మిగిలిన పాటలను కూడా అవుట్ స్టాండింగ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను ఎక్కడా తగ్గకుండా వేరే లెవెల్ లో అందించడానికి కృషి చేస్తున్నారు.

వకీల్ సాబ్ బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ చిత్రానికి రీమేక్ అన్న విషయం తెల్సిందే. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వేణు శ్రీరామ్ దర్శకుడు. అలాగే పవన్ కళ్యాణ్ సరసన చిన్న పాత్రలో శృతి హాసన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరో ముప్పై రోజుల షూటింగ్ ఈ చిత్రానికి బ్యాలెన్స్ ఉంది.