పవన్ విషయంలో బలంగా కోరుకోండి అయిపోతుంది అంటున్న వాల్మీకి దర్శకుడు


Pawan Kalyan And Harish Shankar
పవన్ విషయంలో బలంగా కోరుకోండి అయిపోతుంది అంటున్న వాల్మీకి దర్శకుడు

ఏ విషయంలోనైనా సంకల్ప బలం అనేది చాలా ముఖ్యమంటుంటారు. మనం దేని గురించైనా బలంగా కోరుకుంటే జరిగి తీరుతుందని కూడా అంటారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కు ఇదే చెప్తున్నాడు వాల్మీకి దర్శకుడు హరీష్ శంకర్. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే వాల్మీకి ప్రీ రిలీజ్ వేడుకలో హరీష్ శంకర్ ను మాట్లాడుతూ ఇటీవలే పవన్ ను కలిశానని అయితే సినిమాల గురించి ఏం మాట్లాడుకోలేదని అన్నాడు.

కానీ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం హరీష్ శంకర్ చేత పవన్ కు కథ చెప్పించాలని మైత్రి మూవీ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. బయట వస్తున్న వార్తలకు బలం చేకూర్చేలా హరీష్ శంకర్ వాల్మీకి ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. పవన్ సినిమాల్లోకి తిరిగి రావాలని బలంగా కోరుకోమని అన్నాడు హరీష్. గబ్బర్ సింగ్ హిట్ కావాలని ఎలా కోరుకున్నారో, అలాగే ఆయన తిరిగి సినిమాలు చేయాలని అనుకోవాలని, బలంగా కోరుకుంటే జరగవచ్చేమో అన్నాడు.

మొత్తానికి పవన్ తిరిగి సినిమాల్లోకి రావడానికి ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ ఆలోచన అయితే మొదలైందని కచ్చితంగా తెలుస్తోంది. ఆయన అంటూ ఒప్పుకుంటే పవన్ చేత సినిమాలు చేయించాలని ముగ్గురు, నలుగురు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.