ఓపెనింగ్‌కి డుమ్మాకొట్టిన స్టార్ హీరో!Pawan Pink telugu remake pooja ceremony completed
Pawan Pink telugu remake pooja ceremony completed

తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌లుగా నిలిచిన చిత్రాలు బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న విష‌యం తెలిసిందే. అక్క‌డ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించి బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతున్నాయి. ఇదే ఇటీవ‌ల తెలుగులో సంచ‌ల‌నం సృష్టించిన `అర్జున్‌రెడ్డి` బాలీవుడ్‌లో రీమేక్ అయి దాదాపు 350 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన విష‌యం తెలిసిందే. తాజాగా నాని న‌టించిన `జెర్సీ` చిత్రం కూడా బాలీవుడ్‌కు వెళుతోంది. షాహీద్ క‌పూర్ న‌టిస్తున్న ఈ సినిమా గురువారం లాంఛ‌నంగా ముంబైలో మొద‌లైంది.  బాలీవుడ్‌లో  సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన `పింక్‌` సినిమా తెలుగులో రీమేక్ కాబోతున్న విష‌యం తెలిసిందే.

ఇప్ప‌టికే త‌మిళంలో `నేర్కొండ పార్వై` పేరుతో రూపొంది అక్క‌డ సంచ‌ల‌నం సృష్టించింది. అజిత్ హీరోగా  న‌టించిన ఈ చిత్రాన్ని ఆయ‌న ఇమేజ్‌కు అనుగుణంగా క‌మ‌ర్షియ‌ల్ హంగుల్ని జోడించి `ఖాకీ` ఫేమ్ వినోద్ తెర‌పైకి తీసుకొచ్చారు. ఇదే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నారు. బోనీక‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తున్నారు. `ఎంసీఏ` ఫేమ్ శ్రీ‌రామ్ వేణు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌బోతున్నాడు. తెలుగు నేటికి, ప‌వ‌న్ ఇమేజ్‌కి అనుగుణంగా క‌మ‌ర్షియ‌ల్ అంశాల్ని జోడించి ఈ చిత్రాన్ని రూపొందించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

గురువారం మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న చిత్ర వ‌ర్గాలు ఈ సినిమా ముహూర్త స‌న్నివేశాల‌ని, పూజా కార్య‌క్ర‌మాల‌ని హైద‌రాబాద్‌లోని దిల్ రాజు ఆఫీస్‌లో సైలెంట్‌గా కానిచ్చేసిన‌ట్టు తెలిసింది. ఈ కార్య‌క్ర‌మానికి హీరో ప‌వన్‌క‌ల్యాణ్ డుమ్మా కొట్టార‌ట‌. హీరో లేకుండా దిల్ రాజు తొలి సారి ఓ సినిమా ముహూర్తాన్ని పూర్తి చేయ‌డం ఇదే మొద‌టి సారి కావ‌డం అంతా చ‌ర్చించుకుంటున్నారు. జ‌న‌వ‌రి నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇందులోని కీల‌క పాత్ర కోసం చిత్ర బృందం స‌మంతాను సంప్ర‌దించిన‌ట్లు తెలిసింది.