పవన్ 27వ చిత్రానికి కూడా ముహూర్తం కుదిరిందా?పవన్ 27వ చిత్రానికి కూడా ముహూర్తం కుదిరిందా?
పవన్ 27వ చిత్రానికి కూడా ముహూర్తం కుదిరిందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 25వ చిత్రం అజ్ఞాతవాసి ప్రేక్షకులను అలరించడంలో దారుణంగా విఫలమైంది. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా రాజకీయాలకు దగ్గరగా మెలిగారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్న సమయంలోనే కొంత మంది నిర్మాతల దగ్గర అడ్వాన్స్ లు తీసుకున్నారు. అప్పట్లో అవి వెనక్కి తిరిగి ఇచ్చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ అవుతున్నారు. ఆయన ప్రస్తుతం పింక్ రీమేక్ లో నటిస్తున్నారు. రెండు రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు పింక్ రీమేక్ లో నటిస్తూనే, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వేడెక్కిన రాజకీయాలపై స్పందిస్తున్నారు.

పింక్ రీమేక్ పవన్ కెరీర్ లో 26వ చిత్రం. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ తన 27వ సినిమాను కూడా మొదలుపెడుతున్నట్లు తెలుస్తోంది. పవన్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తాడని గత కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని, ఈ నెల 27న చిత్రం అధికారికంగా ప్రారంభవుతుందని ఒక ప్రముఖ పీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. ఫిబ్రవరి నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవ్వబోతున్నట్లు సమాచారం.

ఫిబ్రవరి నుండి అటు పింక్ రీమేక్, ఇటు క్రిష్ ప్రాజెక్ట్.. రెండు షూటింగ్స్ లోనూ సమాంతరంగా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వం వహించబోయే చిత్రంలో పవన్ ఒక బందిపోటుగా కనిపిస్తాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాక ప్యాన్ ఇండియా లెవెల్లో తీయబోతున్నారట. స్వాతంత్రానికి ముందు జరిగే కథగా ఈ చిత్రం ఉంటుందని సమాచారం. సాయి మాధవ్ బుర్రా ఇప్పటికే ఈ చిత్రానికి డైలాగ్ వెర్షన్ సిద్ధం చేస్తున్నాడట. ఏఎమ్ రత్నం నిర్మించబోయే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.