కన్ఫర్మ్ : సైరాలో పవన్ కళ్యాణ్


Pawan Kalyan
కన్ఫర్మ్ : సైరాలో పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సైరా నరసింహారెడ్డి టీజర్ కు వాయిస్ ఓవర్ అందించిన విషయం తెల్సిందే. పవన్ వాయిస్ వినిపిస్తూ, తెరపై చిరు కనిపిస్తుంటే మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. ముఖ్యంగా పవన్ సై సైరా నరసింహారెడ్డి అన్న విధానానికి రోమాలు నిక్కబొడుచుకున్నాయనే చెప్పాలి. ఇదిలా ఉంచితే నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి.

ఈ సందర్భంగా అక్కడున్న విలేఖరి టీజర్ కి పవన్ వాయిస్ ఓవర్ అందించారుగా, మరి సినిమాలో కూడా పవన్ వాయిస్ ఓవర్ ఉంటుందా అన్న ప్రశ్నకు రామ్ చరణ్ కొంత సంశయిస్తూనే అవునని సమాధానం చెప్పారు. టీజర్ లో పవన్ వాయిస్ వస్తేనే సంబరపడిపోయిన మెగా అభిమానులు, ఇక థియేటర్ లో పండగ చేసుకోవడం ఖాయం. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుదీప్ అమితాబ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. నిన్న విడుదలైన సైరా ట్రైలర్ కు విశేష స్పందన లభించింది.