స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్.. సుభాష్ చంద్ర‌బోస్ మ‌ధ్య‌లో..


స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్.. సుభాష్ చంద్ర‌బోస్ మ‌ధ్య‌లో..
స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్.. సుభాష్ చంద్ర‌బోస్ మ‌ధ్య‌లో..

గురువారం ఉద‌యం నుంచి ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి వ‌రుస స‌ర్‌ప్రైజ్‌ల‌ని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ టీమ్ అందిస్తోంది. ఈ రోజు ప‌వ‌న్ పుట్టిన రోజు కావ‌డంతో బ్యాక్ టు బ్యాక్ ఫ్యాన్స్ కి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు ఇవ్వ‌డం మొద‌లుపెట్టారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండున్న‌రేళ్ల విరామం త‌రువాత ప్రేక్ష‌కుల ముందుకు రానున్న చిత్రం `వ‌కీల్ సాబ్‌` నుంచి స‌ర్‌ప్రైజ్‌ల హంగామా మొద‌లైంది.

ఉద‌యం ఈ మూవీ కి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసి ఓ రేంజ్‌లో ర‌చ్చ చేశారు ఈ మూవీ టీమ్‌. ఆ త‌రువాత వెంట‌నే ద‌ర్శ‌కుడు క్రిష్ రంగంలోకి దిగారు. త‌ను ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పిరియాడిక్ డ్రామాని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఇదే ప‌వ‌న్ న‌టిస్తున్న 27వ చిత్రం. మొఘ‌ల్ సామ్రాజ్య కాలం నాటి కోహినూర్ వ‌జ్రం నేప‌థ్యంలో ఈ సినిమా సాగ‌నుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీలుక్ పోస్ట‌ర్‌ని ద‌ర్శ‌కుడు క్రిష్ తాజాగా రిలీజ్ చేశారు.

ఇక పీఎస్‌పీకే 28వ చిత్రంగా హ‌రీష్‌శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ని మైత్రీ మూవీమేక‌ర్స్ రిలీజ్ చేశారు. హ‌ర్లే డేవిడ్ స‌న్ బైక్‌… దానిపై గాజుల స‌త్య‌నారాయ‌ణ పెద్ద బాల‌శిక్ష బుక్‌, ఓ గులాబీ పువ్వు,  పీకె అనే ప‌దాల్లో స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌, సుభాష్ చంద్ర‌బోస్ ల ఫొటోలు, బ్యాగ్రౌండ్‌లో ఇండియా గేట్ క‌నిపిస్తుండ‌టం, ఈ సారి వినోదం మాత్ర‌మే కాదు అంటూ ట్యాగ్ లైన్ వుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.