టాలీవుడ్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు


Pawankalyan and mega heroes at film chamberటాలీవుడ్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో మెగా హీరోలు పవన్ కళ్యాణ్, నాగబాబు , అల్లు అర్జున్, రాంచరణ్ లు సమావేశమయ్యారు . మెగా హీరోలు ఛాంబర్ కు చేరుకున్నారన్న విషయం మెగా ఫ్యాన్స్ కు తెలియడంతో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఛాంబర్ కు చేరుకున్నారు. అలాగే మీడియా కూడా ఛాంబర్ కు చేరుకోవడంతో సందడి మొదలయ్యింది.

ఇక మెగా హీరోలు అందునా పవన్ కళ్యాణ్ కూడా ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకున్నారని తెలియగానే పలువురు దర్శక నిర్మాతలు ,నటీనటులు ఫిల్మ్ ఛాంబర్ బాట పట్టారు మెగా కుటుంబానికి మద్దతు తెలియజేయడానికి. సాయంత్రం వరకు మెగా హీరోలు ఛాంబర్ లోనే ఉంటారని తెలియడంతో ఫిల్మ్ ఛాంబర్ సరౌండింగ్స్ క్రిక్కిరిసిపోయింది.