RRR సెట్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏం జ‌రుగుతోంది?

RRR సెట్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏం జ‌రుగుతోంది?
RRR సెట్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏం జ‌రుగుతోంది?

ద‌ర్శ‌క‌ధీరుడు జ‌క్క‌న్న తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `RRR`. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ , మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్నారు. అలియాభ‌ట్‌, ఒలివియా మోరీస్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీం పాత్ర‌ల్లో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌నిపించ‌బోతున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో జ‌రుగుతోంది. అక్క‌డ ఎన్టీఆర్ పై కీల‌క పోరాట ఘ‌ట్టాల్నిచిత్రీక‌రిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ సెట్‌లోకి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎంట‌ర‌య్యార‌ట. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌స్తుతం సాగ‌ర్ చంద్ర తెర‌కెక్కిస్తున్న చిత్రంలో న‌టిస్తున్నారు.

మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుయ్ కోషియుమ్‌` ఆధారంగా ఈ చిత్రాన్నిరీమేక్ చేస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సూర్యదేవ‌ర నాగ‌వంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా RRR సెట్‌లోకి ఎంట‌రైన ప‌వ‌ర్‌స్టార్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళితో కొంత సేపు ఉచ్చ‌టించార‌ట‌. ఏం మాట్లాడుకున్నారు అన్న‌ది మాత్రం ఇంత వ‌ర‌కు బ‌య‌టికి రాలేదు.