`గ‌బ్బ‌ర్‌సింగ్` కోసం బండ్ల గ‌ణేష్ ఏం చేశారంటే..!


`గ‌బ్బ‌ర్‌సింగ్` కోసం బండ్ల గ‌ణేష్ ఏం చేశారంటే..!
`గ‌బ్బ‌ర్‌సింగ్` కోసం బండ్ల గ‌ణేష్ ఏం చేశారంటే..!

అరెఓ సాంబా .. రాస్కో.. నాక్కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది.. అంటూ `గ‌బ్బ‌ర్‌సింగ్‌` చిత్రంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ సినిమా ఇచ్చి నేటికి ఎనిమిదేళ్లు. అయినా ఈ డౌలాగ్స్ ఇప్ప‌టికీ మారుమ్రోగుతూనే వున్నాయి. చిన్న వాళ్ల ద‌గ్గ‌రి నుంచి పెద్ద వాళ్ల వ‌ర‌కు ఏదో ఒక సంద‌ర్భంలో ఈ సినిమాని, ఈ సినిమాలోని డైలాగ్స్‌ని గుర్తు చేసుకుంటూనే వున్నారు.

ప‌వర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు చాలా కాలం త‌రువాత తిరుగులేని విజ‌యాన్ని అందించిన చిత్ర‌మిది. హిందీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ `ద‌బాంగ్‌` ఆధారంగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌కి ఓ పండ‌గ‌ని తెచ్చిపెట్టింది. దీంతో ఈ చిత్ర విజాయ‌న్ని గుర్తు చేసుకుంటూ ఈ సినిమా విడుద‌లైన ఈ రోజును గుర్తు చేసుకుంటూ సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ ఫ్యాన్స్ హంగామా మొద‌లుపెట్టారు.

ఈ చిత్రాన్ని నిర్మించిన బండ్ల గ‌ణేష్ మాత్రం వినూత్నంగా త‌న ఇంట్లో గ‌ణ‌ప‌తి హోమాన్ని నిర్వ‌హించి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై త‌న‌కున్న అభిమానాన్ని మ‌రోసారి చాటుకున్నారు. `అంద‌రూ పుట్టిన రోజు నాడు, పెళ్లి రోజు నాడు హోమం చేసుకుంటారు. నేను నా కుటుంబ స‌భ్యుల‌తో `గ‌బ్బ‌ర్‌సింగ్` విడుద‌ల రోజు గ‌ణ‌ప‌తి హోమం చేశాను` అని త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి నిర్వ‌హించిన హోమానికి  సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ లో షేర్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది.