ప‌వ‌ర్‌స్టార్ డ‌బుల్ ధ‌మాకా?


Pawankalyan double dhamaka in krish film
Pawankalyan double dhamaka in krish film

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ సినిమాలు చేయ‌డం మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` ఆధారంగా దిల్ రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `వ‌కీల్ సాబ్‌`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈ చిత్ర షూటింగ్‌ని నిర‌వ‌ధికంగా ఆపేశారు. ఏప్రిల్ నుంచి మ‌ళ్లీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్టే అవ‌కాశం వుంది.

ఇదిలా వుంటే ప‌వ‌న్ ఈ సినిమాతో  పాటు క్రిష్ తెర‌కెక్కిస్తున్న పిరియాడిక్ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెల‌సిందే. ఏ.ఎం. ర‌త్నం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. మొఘ‌ల్ సామ్రాజ్యం కాలం నాటి కోహినూర్ వ‌జ్రం నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంలో ద‌ర్శ‌కుడు క్రిష్ రూపొందిస్తున్నారు. అందుకే ఈ చిత్రం కోసం అత్య‌ధికంగా భారీ సెట్ల‌ని నిర్మించి షూట్ చేస్తున్నారు. ఇటీవ‌ల అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో చిత్రీక‌రించిన వాట‌ర్ ఫాల్స్ ఎపిసోడ్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంద‌ట‌.

ఇదిలా వుంటే ఇందులో ప‌వ‌న్ తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ‌ల సాయ‌న్న‌గా క‌నిపించ‌బోతున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ప‌వ‌న్ ఇందులో డ్యుయెల్ రోల్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త ప‌వ‌న్‌స్టార్ అభిమానుల్లో మ‌రింత జోష్‌ని నింపుతూ సినిమాపై భారీ అంచ‌నాల్ని పెంచేస్తోంది. ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాలంటే ద‌ర్శ‌కుడు క్రిష్ పెద‌వి విప్పాల్సిందే.