ఉద‌య్‌పూర్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ హ‌ల్‌చ‌ల్‌!

ఉద‌య్‌పూర్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ హ‌ల్‌చ‌ల్‌!
ఉద‌య్‌పూర్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ హ‌ల్‌చ‌ల్‌!

చైతన్య జోన్నలగడ్డతో మెగా డాట‌ర్‌ కొణిదెల నిహారిక ‌ వివాహానికి కేవలం కొన్ని గంటల స‌మ‌యం మాత్రమే వుంది. దాదాపు మెగా, అల్లు, జోన్నలగడ్డ ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ ప్ర‌త్యేక విమానాల్లో ఉదయపూర్ చేరుకున్నారు.  సంగీత్ పార్టీలో పాల్గొన్నారు. నిహారిక పెళ్లికి మెగా ఫ్యామిలీ నుంచి బ‌య‌లుదేరిన చివరి వ్యక్తి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.

ఈ మధ్యాహ్నం పవన్ హైదరాబాద్ బేగంపేట్‌ విమానాశ్రయం నుండి రాజస్థాన్ కు ప్రత్యేక విమానంలో వెళ్ళారు. ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ లో ఉద‌య్‌పూర్ వెళ్లారు. వెళ్లే ముందు బేగంపేట్ ఏయిర్ పోర్ట్‌లో వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో బ్లాక్ గాగుల్స్  ధ‌రించి క‌నిపించారు ప‌వ‌న్‌. ప‌వ‌న్ కు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప్ర‌త్యేక విమానం లో ఉద‌య్‌పూర్ చేరుకున్న ప‌వ‌న్ ఏయిర్ పోర్ట్ నుంచి ఓబెరాయ్ ఉద‌య్ విలాస్‌కి చేరుకున్నారు.

ఆగ‌స్టులో జ‌రిగిన నిహారిక నిశ్చితార్థానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ హాజ‌రు కాని విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నిహారికి త‌న పెళ్లికి ఖ‌చ్చితంగా హాజ‌రు కావాల‌ని ప‌వ‌న్ వ‌ద్ద మాట తీసుకుంద‌ట‌. ఈ మాట ప్ర‌కార‌మే ప‌వ‌న్ ఉద‌య్‌పూర్‌కి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది.