ప‌వ‌ర్‌స్టార్ బ‌రువు త‌గ్గుతున్నారా?

Pawankalyan losing weight for ayyappanum koshiyum remake
Pawankalyan losing weight for ayyappanum koshiyum remake

రెండున్న‌రేళ్ల త‌రువాత కెమెరా ముందుకొచ్చారు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ ‌క‌ల్యాణ్‌. `వ‌కీల్‌సాబ్‌` చిత్రంతో మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం మొద‌లుపెట్టారు. శ్రీ‌రామ్ వేణు తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తియి రిలీజ్ డేట్‌ని కూడా ప్ర‌క‌టించేశారు. దీంతో వెంట‌నే మ‌రో చిత్రాన్ని ప‌వ‌న్ ప‌ట్టాలెక్కించారు. మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `య్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా సాగ‌ర్ చంద్ర తెర‌కెక్కిస్తున్న చిత్రంలో న‌టిస్తున్నారు ప‌వ‌న్.

మ‌రో కీల‌క పాత్ర‌లో రానా ద‌గ్గుబాటి న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. సీతార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్యదేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ ప్రస్తుతం అల్యూమిన‌యం ఫ్యాక్ట‌రీలో జ‌రుగుతోంది. ఇందులో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో  న‌టిస్తున్నారు. పొల్లాచ్చీలో ప‌వ‌న్‌, రానాల‌పై ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించ‌బోతున్నారు.

ఇదిలా వుంటే ఈ చిత్రం కోసం ప‌వ‌న్ బ‌రువు త‌గ్గుతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప‌వ‌న్‌, రానాల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు హైలైట్‌గా నిల‌వ‌నున్నాయ‌ట‌. అయితే ఇందులో ప‌వ‌న్ కొంత బ‌రువు త‌గ్గి క‌నిపించాల‌ట‌. ఇందు కోసం ప‌వ‌న్ బ‌న‌రువు త‌గ్గుతున్న‌ట్టు చెబుతున్నారు. పొల్లాచ్చి షెడ్యూల్‌లో సాయి ప‌ల్ల‌వి ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని, త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ని వెల్ల‌డించ‌నున్నార‌ని తెలిసింది.