ప‌వ‌ర్‌స్టార్‌తో షూటింగ్ కండీష‌న్స్ అప్లై!


ప‌వ‌ర్‌స్టార్‌తో షూటింగ్ కండీష‌న్స్ అప్లై!
ప‌వ‌ర్‌స్టార్‌తో షూటింగ్ కండీష‌న్స్ అప్లై!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ షూటింగ్ చేయాలంటే కండీష‌న్స్ పెడుతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ప‌వ‌ర్‌స్టార్ న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. శ్రీ‌రామ్ వేణు రూపొందిస్తున్నారు. దిల్ రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. `పింక్` ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఆపేశారు. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌రువాత మ‌ళ్లీ షూట్ మొద‌లుపెట్టాల‌ని నిర్ణ‌యించారు.

అయితే ప‌రిస్థితుల్లో మార్పులు రాక‌పోవ‌డంతో చిన్న చిన్న‌గా నాగార్జున‌, నాగ‌చైత‌న్య షూటింగ్ మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. దీంతో `వ‌కీల్‌సాబ్‌` టీమ్ కూడా షూటింగ్ మొద‌టుపెట్టాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చేసింది. అది కూడా ప‌వ‌న్ పైనే ఎక్కువ‌గా సీన్స్ షూట్ చేయాల్సి వుంద‌ట‌. దీంతో ప‌వ‌న్ రాత్రి పూట అంటే సాయంత్రం 6 త‌రువాత తాను పూజ చేసుకోవాలి. అలా చేయ‌కుండా  షూటింగ్ చేయ‌న‌ని నిక్క‌చ్చిగా చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ గ‌త కొన్ని రోజులుగా చ‌తుర్మాస ధీక్ష చేస్తున్నారు. 6 త‌రువాత పూజా చేయ‌కుండా ఆయ‌న బ‌య‌టికి వ‌స్తే ఆ ధీక్ష భ‌గ్నం అయిన‌ట్టే.

ఆ కార‌ణంగానే ప‌వ‌న్ `వ‌కీల్‌సాబ్‌` యూనిట్‌కి కండీష‌న్స్ పెడుతున్నార‌ట‌. ప‌వ‌న్ చ‌తుర్మాస ధీక్ష న‌వంబ‌ర్‌తో పూర్త‌వుతుంది. కానీ దిల్ రాజు మాత్రం అంత వ‌ర‌కు వేచి చూడాల‌నుకోవ‌డం లేదు. దీంతో వ‌చ్చే నెల 23 నుంచి షూట్ మొద‌లుపెట్టాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలిసింది. ఇందుకు కండీష‌న్‌ల‌తో ప‌వ‌న్ అంగీక‌రించార‌ట‌. దీంతో `వ‌కీల్‌సాబ్‌` షూటింగ్ ప‌వ‌న్ కండీష‌న్‌ల‌తో సాగ‌నున్న‌ట్టు ఇన్ సైడ్ టాక్‌.