స్వా‌మీజీ దుస్తుల్లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్!


స్వా‌మీజీ దుస్తుల్లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్!
స్వా‌మీజీ దుస్తుల్లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్!

ఇటీవ‌ల సినిమాల్లో న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డిపేసిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వన్ కల్యాణ్ ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా సాధువు డ్రెస్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి షాకిచ్చారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో చ‌తుర్మాస దీక్ష అంటూ ప్ర‌త్యేక దీక్ష‌ని చేప‌ట్టిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొన్ని రోజుల పాటు ఫామ్ హౌస్‌కే ప‌రిమిత‌మైన విష‌యం తెలిసిందే.తాజాగా మ‌రోసారి స్వామీజీ దుస్తుల్లో క‌నిపించే స‌రికి ఆయ‌న ఫ్యాన్స్ షాక్‌కు కుగుర‌వుతున్నారు.

అయితే తిరుప‌తిలో స్వామివారిని ద‌ర్శించుకునే క్ర‌మంలో ప‌వ‌న్ కాషాయ దుస్తుల్ని ధ‌రించారని తెలిసింది.  గ‌త కొంత కాలంగా తిరుప‌తి వెళ్లి స్వామివారిని ద‌ర్శించాల‌నుకుంటున్న ప‌వ‌న్ ఈ రోజు తిరుప‌తిలో సంద‌డి చేశారు. శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం ఆయ‌న‌ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. రామ మందిర నిర్మాణానికి 30 ల‌క్ష‌లు విరాళంగా ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

త్వ‌ర‌లో తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ రామ మందిరానిక‌రి 30 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన `వ‌కీల్ సాబ్‌` చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లో మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్పనుమ్ కోషియుమ్` రీమేక్‌లో ప‌వ‌న్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.