మేనల్లుడి కోసం నడుం బిగించిన పవన్ కళ్యాణ్


pawankalyan phone call to karunakaran

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు వరుసగా పరాజయాలు ఎదురు అవుతుండటంతో అతడ్ని సక్సెస్ బాట పట్టించడానికి నడుం బిగించాడు మేనమామ పవన్ కళ్యాణ్ . సాయి ధరమ్ తేజ్ కు వరుసగా అయిదు ప్లాప్ చిత్రాలు వచ్చాయి , తాజాగా రిలీజ్ అయిన ఇంటలిజెంట్ కూడా డిజాస్టర్ కావడంతో అతడి కోసం కరుణాకర్ కు ఫోన్ చేసాడట పవన్ కళ్యాణ్ . ఇంతకుముందు పవన్ కళ్యాణ్ – కరుణాకరన్ ల కాంబినేషన్ లో ” తొలిప్రేమ ” వంటి సంచలన చిత్రం రాగా ఆ తర్వాత ” బాలు ”వంటి యావరేజ్ చిత్రం వచ్చింది .

అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కరుణాకరన్ సినిమా చేయాలనీ భావించాడు కానీ పవన్ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు కట్ చేస్తే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కు ఓ ప్రేమకథా చిత్రం చేసి పెట్టమని కోరాడట ! ఒకవేళ ఈ ఇద్దరి కాంబినేషన్ లో కనుక సినిమా వస్తే మెగా ఫ్యాన్స్ కి సంతోషమే కదా !