కొండగట్టు కి బయలుదేరిన పవన్ కళ్యాణ్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన యాత్ర ని ప్రారంభించాడు. కొండగట్టు నుండి తన రాజకీయ యాత్ర ప్రారంభం అవుతుందని ఇంతకుముందు ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఈరోజు జనసేన కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరాడు పవన్. భార్య అన్నా లేజ్నోవా పవన్ కి తిలకం దిద్ది హారతి ఇచ్చి యాత్ర దిగ్విజయం కావాలని శుభషకునం పలికింది.

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దాదాపు 50 వాహనాలతో బయలుదేరింది కొండగట్టు కు. అక్కడికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకున్న తర్వాత కొండగట్టు అంజన్న ని దర్శనం చేసుకున్న తర్వాత అభిమానులు, కార్యకర్తలతో సమావేశం కానున్నాడు. 3 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర తో రాజకీయ ప్రకంపనలు సృష్టించడం ఖాయమని నమ్మకంగా ఉన్నారు పవన్ ఫ్యాన్స్. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.