ప‌వ‌న్ ఫామ్ హౌస్‌ నుంచి బ‌య‌టికొస్తున్నారు!


ప‌వ‌న్ ఫామ్ హౌస్‌ నుంచి బ‌య‌టికొస్తున్నారు!
ప‌వ‌న్ ఫామ్ హౌస్‌ నుంచి బ‌య‌టికొస్తున్నారు!

గ‌త ఏడు నెల‌లుగా లాక్‌డౌన్ కార‌ణంగా సినిమా షూటింగ్‌లు ఆగిపోవ‌డం.. క‌రోనా క‌రాళ నృత్యంత చేస్తుండ‌టంతో స్టార్ హీరోల‌తో పాటు చాలా మంది సెల‌బ్రిటీలు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఇదే స‌మ‌యంలో స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్ చ‌తుర్మాస దీక్ష‌ని చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. గ‌త నాలుగు నెల‌లుగా ఈ దీక్ష కార‌ణంగా ఆయ‌న ఫామ్ హౌస్ కే ప‌రిమిత‌మ‌య్యారు. కాలు బ‌య‌ట పెట్టే ప్ర‌య‌త్నం చేయ‌లేదు.

తాజాగా ప‌వ‌న్ చతుర్మాస దీక్ష పూర్త‌యింది. దీంతో ఆయ‌న ఫామ్ హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేశారు. ఇటీవ‌ల కేంద్రం అన్‌లాక్ ప్ర‌క్రియ‌లో భాగంగా కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ని రిలీజ్ చేయ‌డంతో సినిమా షూటింగ్‌లు మొద‌ల‌య్యాయి. ఈ నేప‌థ్యంలో ప‌వ‌ర్‌స్టార్ న‌టిస్తున్న `వ‌కీల్ సాబ్‌` షూటింగ్ కూడా ఇటీవ‌ల మొద‌లైంది. ఈ మూవీ షూటింగ్‌లో ప‌వ‌న్ పాల్గొన‌బోతున్నారు. ఈ నెల 23 నుంచి ప‌వ‌న్ ఈ మూంవీ షూటింగ్‌లో పాల్గొన‌బోతున్నారు. ఇందుకు ఏర్పాట్లు కూడా పూర్త‌య్యాయి.

న‌వంబ‌ర్ ఎండ్ వ‌ర‌కు షూట్ కంప్లీట్ చేయ‌య‌బోతున్నారు. జ‌న‌వ‌రిలో సంక్రాంతికి ఈ చిత్రాన్ని బ‌రిలోకి దింపేస్తున్నారు. ఇందు కోసం ప‌క్కా ప్లాన్‌తో దిల్ రాజు పోస్ట్ ప్రొడక్ష‌న్ వ‌ర్క్ కూడా ఏక కాలంలో పూర్తి చేయ‌బోతున్నారు. శృతిహీస‌న్ కూడా త్వ‌ర‌లో ఈ మూవీ సెట్‌లోకి ఎంట‌ర్ కానుంద‌ట‌. ప‌వ‌న్‌, శృతీహాస‌న్‌ల‌పై ఓ పాటతో పాటు ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌కి సంబంధించిన స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తార‌ట‌.