ప‌వ‌న్ సెట్‌లోకి వ‌చ్చేస్తున్నారు!

ప‌వ‌న్ సెట్‌లోకి వ‌చ్చేస్తున్నారు!
ప‌వ‌న్ సెట్‌లోకి వ‌చ్చేస్తున్నారు!

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ సెట్‌లోకి వ‌చ్చేస్తున్నారు. గ‌త ఏడు నెల‌లుగా షూటింగ్‌లు ఆగిపోవ‌డంతో ఇంటి ప‌ట్టునే వున్నా ఆయ‌న ఆ త‌రువాత చ‌తుర్మాస దీక్ష చేప‌ట్టి ఫామ్ హౌస్‌కే ప‌రిమిత‌మైన విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌కీల్‌సాబ్‌`షూటింగ్ మొద‌లైంది. అయితే ఈ సెట్‌లో ప‌వ‌న్ పాల్గొన‌డం లేదు. ఆయ‌న లేకుండా కొన్ని స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు.

వ‌చ్చే నెల 1 నుంచి ప‌వ‌న్ `వ‌కీల్ సాబ్‌` సెట్‌లో సంద‌డి చేయ‌బోతున్నారు. స్పీడుగా ఈ మూవీని పూర్తి చేసి క్రిష్‌ మూవీతో పాటు మల‌యాళ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` రీమేక్‌లో పాల్గొన‌బోతున్నార‌ట‌. సాగ‌ర్ చంద్ర ఈ చిత్రానికి ద‌ర్శ‌‌క‌త్వం వహించ‌బోతున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మించ‌బోతున్నారు.

ఇందులో ప‌వన్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. మ‌రో పాత్ర‌లో రానా న‌టించే అవ‌కాశం వుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విష‌యంలో మేక‌ర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్నివివ‌రాల్ని చిత్ర బృందం వెల్ల‌డించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.