క‌రోనా దెబ్బ `వ‌కీల్ సాబ్‌`ని కూడా తాకింది!


Pawankalyan Vakeel saab rlese to be postponed
Pawankalyan Vakeel saab rlese to be postponed

ప్ర‌పంచాన్ని బెంబేతెల్లిస్తున్న క‌రోనా దెబ్బ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`ని కూడా తాకింది. బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్‌` ఆధారంగా దిల్ రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ప‌వ‌న్ ఫ‌స్ట్ లుక్‌తో పాటు ఫ‌స్ట్ లిరిక‌ల్ సింగిల్ మ‌గువ‌.. మ‌గువ‌.. పాట కూడా ఓ రేంజ్‌లో ఆక‌ట్టుకుంటూ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది.

ఈ చిత్రాన్ని మే 15 రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేసింది. అంతా అనుకున్న‌ట్టుగానే సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ క‌రోనా కార‌ణంగా సినిమా షూటింగ్ మ‌రింత ఆల‌స్యం అయ్యేలా క‌నిపిస్తోంది. దీంతో ముందు అనుకున్న మే 15న కాకుండా జూన్‌లో సినిమా విడుద‌ల‌య్యే అవ‌కాశాలే అత్య‌ధికంగా క‌నిపిస్తున్నాయని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

ఇదే త‌ర‌హాలో నాని, సుధీర్‌బాబు న‌టించిన `వి` చిత్ర రిలీజ్ కూడా వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు అన్నీ పూర్తయి ర 25న రిలీజ్ అనుకున్నారు. కానీ హ‌ఠాత్తుగా క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా యూఎస్ డిస్ట్రిబ్యూట‌ర్స్ రిలీజ్‌ని వాయిదా వేయ‌మ‌ని కోర‌డంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెల‌కి వాయిదా వేశారు. దీని కార‌ణంగా `వకీల్ సాబ్‌`ని కూడా వాయిదా వేయాల్సి వ‌చ్చింద‌ని ఇన్ సైడ్ టాక్‌.