ప‌వ‌న్ లేకుండానే స్టార్ట్ చేశారే!


ప‌వ‌న్ లేకుండానే స్టార్ట్ చేశారే!
ప‌వ‌న్ లేకుండానే స్టార్ట్ చేశారే!

గ‌త ఏడు నెల‌లుగా స్టార్ హీరోల‌తో పాటు యంగ్ హీరోల చిత్రాల‌న్నీ ఆగిపోయాయి. ఇప్ప‌ట్లో మ‌హ‌మ్మారిని అదుపు చేయ‌డం కుదిరే ప‌నికాద‌ని తేల‌డంతో మ‌ధ్య‌లో ఆగిపోయిన సినిమాల షూటింగ్‌ల‌ని స్టార్ హీరోలు, యంగ్ హీరోలు మొద‌లుపెట్టేస్తున్నారు. ఇప్ప‌టికే కొంత మంది ప్రారంభించ‌గా.. మ‌రి కొంత మంది స్టార్ట్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మూవీ `వ‌కీల్ సాబ్‌` షూటింగ్ కూడా పునః ప్రారంభం అయిపోయింది.

సోమ‌వారం రాత్రి ఈ మూవీ షూటింగ్‌ని సైలెంట్ గా ప్రారంభించేశారు. అయితే సెట్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ లేకుండానే షూటింగ్ జ‌రుగుతున్న‌ట్టు తెలిసింది. కీల‌క తారాగ‌ణం పాల్గొన‌గా కోర్టు హాల్‌కి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల్ని ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ వేణు చిత్రీక‌రిస్తున్నారు. గ‌తంలో కోర్టుకి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల్ని లాక్‌డౌన్ కి ముందే చిత్రీక‌రించారు. బ్యాలెన్స్‌గా వున్న సీన్స్‌ని ప్ర‌స్తుతం చిత్రీక‌రిస్తున్నారు.

ప‌వ‌న్ వ‌చ్చే నెల మొద‌టి వారం కానీ రెండ‌వ వారం కానీ సెట్‌కి రానున్నార‌ట‌. ప‌వ‌న్ సెట్‌లోకి వ‌స్తే కీల‌కమైన ఓ పాట‌తో పాటు ఓ ఫైట్‌ని షూటింగ్ చేస్తార‌ని తెలిసింది. ఈ పాట‌లో శృతిహాస‌న్ పాల్గొంటుంద‌ని టాక్‌. న‌వంబ‌ర్ వ‌ర‌కు షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి సిద్ధం చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.