ప‌వ‌ర్‌స్టార్ `వ‌కీల్‌సాబ్` టీజ‌ర్ సంక్రాంతికే!

ప‌వ‌ర్‌స్టార్ `వ‌కీల్‌సాబ్` టీజ‌ర్ సంక్రాంతికే!
ప‌వ‌ర్‌స్టార్ `వ‌కీల్‌సాబ్` టీజ‌ర్ సంక్రాంతికే!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌కీల్‌సాబ్‌`. బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ `పింక్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నిజంగా ఇది ఆయ‌న‌కు గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. శృతిహాస‌న్ హీరోయిన్‌గా కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తోంది. బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్‌తో క‌లిసి స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల‌, ప్ర‌కాష్‌రాజ్‌, ముఖేష్ రుషి, అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్త‌యింది. ప్రోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌ల‌య్యాయి. ప‌వ‌న్ ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్‌గా న‌టిస్తున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా గ‌త ప‌ది నెల‌లుగా వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ మూవీ షూటింగ్ ఎట్ట‌కేల‌కు పూర్త‌యింది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తార‌ని అంతా భావించారు కానీ 50 శాతం ఆక్యుపెన్సీ విధానం, స‌మ‌యానికి మూవీ షూటింగ్ పూర్తి కాక‌పోవ‌డం  వంటి కార‌ణాల‌తో ఈ చిత్రాన్ని ఉగాదికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

ఇదిలా వుంటే ఈ మూవీ టీజ‌ర్‌ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న‌ట్టు నిర్మాత‌ల‌లో ఒక‌రైన బోనీక‌పూర్ వెల్ల‌డించారు. `వ‌కీల్‌సాబ్‌` కొత్త పోస్ట‌ర్‌ని షేర్ చేసిన ఆయ‌న టీజ‌ర్‌ని సంక్రాంతికి విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ‌న్యూ ఇయ‌ర్ పోస్ట‌ర్‌లో బైక్‌పై ప‌వ‌న్‌, శృతీహాస‌న్ జాలీగా రైడ్ చేస్తున్నారు. ఈ స్టిల్ ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తోంది.