పవన్ కళ్యాణ్ డెడ్ లైన్ కు ఇదే చివరి రోజు


pawankalyan warns tdp and bjp

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు విధించిన డెడ్ లైన్ ఈరోజు తో ముగుస్తుంది , ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కాదని స్పెషల్ ప్యాకేజి ని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే . అయితే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చామని అంటుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విభజన హామీలు కేంద్రం విస్మరించిందని ఆరోపిస్తోంది . కేంద్రం రాష్ట్రము మీద ……. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో అసలు కేంద్రం ఎంత ఇచ్చింది సవివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలనీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డెడ్ లైన్ విధించాడు .

 

అయితే ఆ డెడ్ లైన్ ఈరోజు తో ముగుస్తోంది . ఈలోగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకుంటే ఇతర పార్టీలతో అలాగే నిపుణులతో చర్చించి తదుపరి కార్యాచరణ ని రూపొందించడానికి సమాయత్తం అవుతున్నాడు . రేపు కమ్యూనిస్టు లతో అలాగే జయప్రకాశ్ నారాయణ , ఉండవల్లి అరుణ్ కుమార్ సమావేశం కానున్నారు . ఈలోపు సమాధానం రాకపోతే జాయింట్ యాక్షన్ కమిటీ ని రూపొందించే పనిలో ఉన్నాడు పవన్ . జనసేన అధినేత తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారితే టిడిపి కి వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పేలా లేవు .