ప‌వ‌న్ `వ‌కీల్‌సాబ్‌`కి డేట్ ఫిక్స్ చేశారా?

ప‌వ‌న్ `వ‌కీల్‌సాబ్‌`కి డేట్ ఫిక్స్ చేశారా?
ప‌వ‌న్ `వ‌కీల్‌సాబ్‌`కి డేట్ ఫిక్స్ చేశారా?

పవన్ కళ్యాణ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం `వకీల్ సాబ్` షూట్ మంగ‌ళ‌వారంతో పూర్త‌యిది. కోవిడ్ -19 మహమ్మారితో పాటు పొలిటిక‌ల్ షెడ్యూల్ కార‌ణంగా ఆల‌స్యం అవుతూ వ‌చ్చిన ఈ మూవీ ఎట్ట కేల‌కు మొద‌లై పూర్త‌యింది. బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్‌` ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని బోనీ క‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. శృతిహాస‌న్ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది.

మంగ‌ళ‌వారంతో ఈ మూవీ షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్రమాలు జ‌రుగుతున్నాయి. దర్శకుడు శ్రీరామ్ వేణు రూపొందిస్తున్న ఈ మూవీలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్‌గా న‌టిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ డేట్‌ని లాక్ చేసిన‌ట్టు తెలిసింది. ఇంత‌కు ముందు క‌రోనా లేకుంటే ముందే విడుద‌ల కావాల్సిన ఈ మూవీని సంక్రాంతికైనా రిలీజ్ చేయాల‌నుకున్నారు.

కానీ ప‌రీస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డంతో వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 9న విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేసిన‌ట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన ప్లాన్ చేస్తున్నారు. టీజ‌ర్‌ని మాత్రం ఈ సంక్రాంతికి రిలీజ్ చేయ‌బోతున్నారు.