క్రిష్ – ప‌వ‌న్ ఫిల్మ్‌ టైటిల్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌!క్రిష్ - ప‌వ‌న్ ఫిల్మ్‌ టైటిల్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌!
క్రిష్ – ప‌వ‌న్ ఫిల్మ్‌ టైటిల్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ న‌టించ‌డం మొద‌లుపెట్టారు. జ‌న సేన పార్టీ కార్య‌క‌లాపాల్లో బిజీగా వున్న ఆయ‌న మ‌ళ్లీ బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్‌` రీమేక్ ఆధారంగా తెర‌కెక్కుతున్న `వ‌కీల్ సాబ్‌`తో కెమెరా ముందుకొచ్చారు. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌‌క‌త్వంలో బోనీ క‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ఇప్ప‌టికే భారీ క్రేజ్‌ని సొంతం చేసుకుంది. సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ మూవీ టీజ‌ర్‌ని రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

ఇదిలా వుంటే ఈ సినిమాతో పాటు ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోహినూర్ వ‌జ్రం నేప‌థ్యంలో క్రిష్ తెర‌కెక్కిస్తున్న పిరియాడిక్ ఫిల్మ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఏ.ఎం. ర‌త్నం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌కు చెందిన అర్జున్ రాంపాల్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారు. మ‌రో కీల‌క పాత్ర‌లో మొగ‌ల్ క్వీన్‌గా శ్రీ‌లంక‌న్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ క‌నిపించ‌నుంది. మొగ‌ల్ సామ్రాజ్యం నాటి కోహినూర్ వ‌జ్రం నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో క్రిష్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ మూవీ ప్రారంభం నుంచి ఈ చిత్రానికి `విరూపాక్ష‌` అనే టైటిల్‌ని అనుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతూ వ‌చ్చింది. తాజాగా `బందిపోటు`, గ‌జ‌దొంగ‌, మంచి దొంగ‌, చోర్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే క్రిష్ మాత్రం స‌ర్‌ప్రైజింగ్ టైటిల్‌తో రాబోతున్నార‌ని, ప‌వ‌న్ పుట్టిన రోజైన సెప్టెంబ‌ర్ 2న ఈ చిత్ర టైటిల్‌ని, ఫ‌స్ట్ లుక్‌ని రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ద‌ర్శ‌కుడు క్రిష్ వున్న‌ట్టు తెలిసింది.