అజ్ఞాతవాసి అక్కడ సూపర్ హిట్


pawan's disaster movie agnaathavasi bumper hit in youtube

పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం ఈ ఏడాది జనవరిలో విడుదలై ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే . అయితే ఇంతటి డిజాస్టర్ సినిమా యు ట్యూబ్ లో మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది . యు ట్యూబ్ లో ఈ సినిమాకు ఇప్పటివరకు 9. 5 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు . అజ్ఞాతవాసి ఫ్లాప్ అయి సంచలనం సృష్టించగా ఇప్పుడేమో యు ట్యూబ్ లో బ్లాక్ బస్టర్ అయి కూడా సంచలనంగా మారింది . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కు అటు త్రివిక్రమ్ కూడా చేదు జ్ఞాపకంగా మిగిలింది . కట్ చేస్తే 9 నెలల్లోనే యు ట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది .

పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్ , అను ఇమ్మన్యుయేల్ లు నటించగా కీలక పాత్రలో కుష్బూ నటించింది . ఈ సినిమాపై పలు వివాదాలు వచ్చినపటికి ఇది నా సినిమా ఒరిజినల్ కథ అంటూ త్రివిక్రమ్ మాయ చేసే మాటలు ఇంకా మాట్లాడుతున్నాడు ఇప్పటికి కూడా. అజ్ఞాతవాసి చిత్రాన్ని కొన్న బయ్యర్లు ఘోరంగా నష్టపోయారు . ఇక పవన్ అభిమానులు కూడా చాలా నిరుత్సాహానికి గురయ్యారు అజ్ఞాతవాసి చిత్ర విషయంలో . కట్ చేస్తే యు ట్యూబ్ లో బంపర్ హిట్ అయ్యింది కాబట్టి వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేయడం ఖాయం .

English Title: pawan’s disaster movie agnaathavasi bumper hit in youtube