శ్రీ‌లంక‌లో వుంటే ఎలా కుదురుతుంది!


శ్రీ‌లంక‌లో వుంటే ఎలా కుదురుతుంది!
శ్రీ‌లంక‌లో వుంటే ఎలా కుదురుతుంది!

బాలీవుడ్‌లో ఓ ప‌క్క డ్ర‌గ్స్ క‌ల‌క‌లం రేపుతుంటే మ‌రో ప‌క్క మీటూ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. సుశాంత్ మృతి త‌రువాత రియా చ‌క్ర‌వ‌ర్తి కార‌ణంగా డ్రగ్స్ వివాదం తెర‌పైకి వ‌చ్చింది. ఇదే స‌మ‌యంలో హీరోయిన్ ‌ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్‌పై చేసిన మీటూ ఆలోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. త‌ను అవ‌కాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న స‌మ‌యంలో అనురాగ్ క‌శ్య‌ప్ త‌న‌ని ఆఫీసు గ‌దిలోకి తీసుకెళ్లి అస‌భ్యంగా త‌డిమాడ‌ని ఒక‌సారి త‌న‌పై అత్యాచారం చేశాడ‌ని మ‌రోసారి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

ఇటీవ‌ల ముంబై పోలీసుల్ని ఆశ్ర‌యించి అనురాగ్‌పై కేసు ఫైల్ చేయించింది. దీంతో ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న పోలీసులు త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందే అంటూ అనురాగ్‌కు స‌మ‌న్లు జారీ చేశారు. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం ముంబైలోని వెర్సోవా పోలీసుల ముందు విచార‌ణ‌కు హాజ‌రై పాయ‌ల్ త‌ప్పుదోవ ప‌ట్టిస్తోంద‌ని, కావాల‌నే అబ‌ద్ధాలు చెబుతోంద‌న్నారు. పాయ‌ల్ లాయర్ చెప్పిన‌ట్టు తాను ఆగ‌స్టు 2013లో ఓ సినిమా షూటింగ్ నిమిత్తం శ్రీ‌లంక వెళ్లాన‌ని, అలాంట‌ప్పుడు నేను అత్యాచారం చేశానంటూ పాయ‌ల్ అబద్ధాలు చెబుతోంద‌ని, త‌ను శ్రీ‌లంక‌లో వుంటే పాయ‌ల్ ఆరోపిస్తున్న‌ట్టు ఎలా కుదురుతుంద‌ని అనురాగ్ ఎదురుప్ర‌శ్నించారు.

అయితే పాయ‌ల్ మాత్రం అనురాగ్ అబ‌ద్ధం చెబుతున్నాడ‌ని కావాలంటే అత‌నికి లైడిటెక్ట‌ర్ ప‌రీక్ష చేయిస్తే నిజా నిజాలేంటో బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని అందు కోసం మా లాయ‌ర్ పోలీసుల్ని సంప్ర‌దిస్తున్నార‌ని పాయ‌ల్ షాకిచ్చింది.