పాయ‌ల్ నో కాంప్ర‌మైజ్ అంటోంది!


పాయ‌ల్ నో కాంప్ర‌మైజ్ అంటోంది!
పాయ‌ల్ నో కాంప్ర‌మైజ్ అంటోంది!

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ త‌న‌ని వేధించాడ‌ని ఇటీవ‌ల పాయ‌ల్ ఘోష్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసి వార్త‌ల్లో నిలిచింది. ఇదే స‌మ‌యంలో ఆమె రిచా చ‌ద్దా గురించి చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారాన్ని సృష్టించాయి. అనురాగ్ క‌ర‌శ్య‌ప్‌తో రిచా చ‌ద్దా అత్యంత స‌న్నిహితంగా వుంటుంద‌ని, ఈ విష‌యాన్ని స్వ‌యంగా అనురాగ్ చెప్పాడంది. అయితే దీనిపై ఆగ్ర‌హించిన రిచా చ‌ద్దా.. పాయ‌ల్ ఘోష్‌పై మండిప‌డింది. త‌న గురించి అస‌భ్యంగా మాట్లాడింద‌ని ఆమెపై ప‌రువు న‌ష్టం దావా వేసిన విష‌యం తెలిసిందే.

ఈ విష‌యంలో పాయ‌ల్ సారి చెప్పి కాంప్ర‌మైజ్ చేసుకోవాల‌ని, రీచా చ‌ద్దాతో నెల‌కొన్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాల‌ని పాయ‌ల్ భావిస్తోందంటూ వార్త‌లు షిక‌రు చేస్తున్నాయి. ఈ వార్త‌ల‌పై పాయ‌ల్ స్పందించింది. రిచా చ‌ద్దా విష‌యంలో తాను ఏ త‌ప్పూ చేయ‌లేద‌ని, అనురాగ్ చెప్పిందే తాను చెప్పాన‌ని స్ప‌ష్టం చేసింది. ఈ సంద‌ర్భంగా పాయ‌ల్ లాయ‌ర్ స్పందించారు.

రిచా చ‌ద్దాకు నా క్లైంట్ పాయ‌ల్‌కు ఎలాంటి విభేధాలు లేవ‌ని, కాబ‌ట్టి అవ‌స‌ర‌మైతే పాయ‌ల్ … రిచాకు క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డానికి సిద్ధంగా వుంద‌ని పాయ‌ల్ లాయ‌ర్‌ వెల్ల‌డించారు. అయితే పాయ‌ల్ ఘోష్ మాత్రం త‌న లాయ‌ర్ మాట‌ల‌కు విరుద్ధంగా స్పందించింది. తాను ఎవ‌రికీ క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు సిద్ధంగా లేన‌ని, రిచాని ఇబ్బంది పెట్టాల‌ని తాను చూడ‌టం లేద‌ని, ఒక‌ మ‌హిళ‌గా మ‌రో మ‌హిళ‌కు అండ‌గా వుండాల‌ని భావిస్తాన‌ని, క‌శ్య‌ప్ నిజ‌స్వ‌రూపాన్ని ప్ర‌పంచానికి తెలియ‌జెప్పాల‌నుకుంటున్నాన‌ని పాయ‌ల్ స్ప‌ష్టం చేసింది.