బాలీవుడ్ కంటే ద‌క్షిణాది బెట‌ర్‌!

బాలీవుడ్ కంటే ద‌క్షిణాది బెట‌ర్‌!
బాలీవుడ్ కంటే ద‌క్షిణాది బెట‌ర్‌!

మీరాచోప్రా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆన్ లైన్ అగ్లీవార్ త‌రువాత ద‌క్షిణాది చిత్ర సీమ‌పై ఉత్త‌రాదిలో విష ప్ర‌చారం మొద‌లైంది. నార్త్ ఇండియా వారిలోనూ ద‌క్షిణాది సినీ ఇండ‌స్ట్రీలో త‌ప్పుడు అభిప్రాయం మొద‌లైంద‌ట‌. ఇది త‌ప్ప‌ని, ఉత్త‌రాది ముఖ్యంగా బాలీవుడ్ వాతావ‌ర‌ణంతో పోలిస్తే ద‌క్షిణాది చాలా బెట‌ర్ అని హీరోయిన్ పాయ‌ల్ ఘోష్ ద‌క్షిణాదిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తోంది.

పాయ‌ల్ ఘోష్ తెలుగులో ఎన్టీఆర్ న‌టించిన `ఊస‌ర‌వెల్లి`, మంచు మ‌రోజ్ న‌టించిన `ప్ర‌యాణం`, ప‌రుచూరి ర‌విబాబు న‌టించి `మిస్ట‌ర్ రాస్కెల్` చిత్రాల్లో న‌టించింది. ఆ త‌రువాత తెలుగు సినిమాల్లో క‌నిపించ‌కుండా పోయింది. తాజాగా మీరాచోప్రా వివాదంతో మ‌ళ్లీ వెలుగులోకి వ‌చ్చింది. ఎన్టీఆర్ పై మీరాచోప్రా చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై కూడా ఘాటుగా స్పందించింది. ఎన్టీఆర్‌కు మ‌హిళ‌ల్ని గౌర‌వించ‌డం తెలుస‌ని చుర‌క‌లంటించింది.

ద‌క్షిణాదిపై బుర‌ద‌జ‌ల్లుతున్న బాలీవుడ్ ఇప్పుడు తెలుగు సినిమా విడుద‌లైతే చాలు దాని రీమేక్ రైట్స్ తీసుకోవాల‌ని పోటీప‌డుతోంద‌ని, కొంత మంది బాలీవుడ్ అమ్మాయిలు ద‌క్షిణాది గురించి అస‌భ్యంగా మాట్లాడ‌టం తాను విన్నాన‌ని, అది క‌రెక్ట్ కాద‌ని వారితో తాను వాదించాన‌ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించింది.