ఇంట్లో కష్టపడుతున్న పాయల్ పాప


ఇంట్లో కష్టపడుతున్న పాయల్ పాప
ఇంట్లో కష్టపడుతున్న పాయల్ పాప

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్నలాక్ డౌన్ ను మళ్లీ ఈనెల అనగా ఏప్రిల్ 30వ తేదీ వరకు కొనసాగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. కాబట్టి ఏప్రిల్ 30 దాకా కూడా ఎటువంటి సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ఉండవు. ఇక సినీ తారలు అందరూ తమ సోషల్ మీడియా అకౌంట్ ల ద్వారా అభిమానులకు ఎప్పటికప్పుడు అప్ డేట్ లు ఇస్తూ… కుదిరినప్పుడల్లా లైవ్ లోకి వస్తూ ముద్దుముద్దుగా కబుర్లు చెబుతున్నారు. ఇక చాలామంది పొద్దున్నేయోగ లేదా ఆసనాలు వేస్తూ వ్యాయామాలు, వంట పనులు చేసుకుంటూ.. ఆ పనులు చేసేటప్పుడు కూడా “ఎంతైనా చిన్నపిల్లలు కాబట్టి చిన్న చిన్న బట్టలు వేసుకుని అభిమానులకు కన్నుల పండుగగా కనిపిస్తున్నారు.

ఇక హీరోయిన్ల విషయానికి వస్తే చాలామంది లైవ్ సెషన్స్ పెడుతున్నారు. మరి కొంతమంది తాము ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్టు చేస్తున్న సేవా కార్యక్రమాల తాలూకు అప్ డేట్స్ పెడుతున్నారు. ఇక ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేయడం మర్చిపోవడం లేదు. “ఆర్ఎక్స్ 100” హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులకు అప్ డేట్స్ ఇస్తూ అందుబాటులో ఉంటున్నారు. ఇక తాజాగా లాక్ డౌన్ కు సంబంధించి ప్రస్తుతం తన క్వారంటైన్ జీవితం ఇలా గడుస్తోందో.? ఆమె ఒక ఫోటోని అప్లోడ్ చేశారు. అందులో ఒకవైపు మంచిగా యోగా మ్యాట్ మీద కూర్చుని క్యూట్ గా, దాని పక్కన ఉన్న ఫోటోలో ఏ మాత్రం మేకప్ లేకుండా సహజమైన అందంతో తలకు బ్యాండ్ కట్టుకొని ఇంట్లో కష్టపడుతున్న పాయల్ ఫోటో ఉంది.

ఇక ఆమె తొలి సినిమా దర్శకుడు అజయ్ భూపతి కూడా ఏది బాగుంది.? అని ఆమెను  ట్యాగ్ చేసిన ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటోలను చూసిన పాయల్ రాజ్ పుత్ అభిమానులు తెలుగు సినిమా ప్రేక్షకులు మేకప్ వేసుకున్నా… మేకప్ వేసుకోకపోయినా పాయల్ రాజ్ సూపర్ గా ఉందని పొగుడుతున్నారు.