పాయల్ ఆర్డీఎక్స్ లవ్ ను ఇంకా మోస్తూనే ఉందిగా


Payal Rajput happy with the response of RDX Love
Payal Rajput happy with the response of RDX Love

ఆరెక్స్ 100తో పాపులారిటీ తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్, తనకొచ్చిన మంచిపేరును మొత్తం చెడగొట్టుకునేందుకు చేసిన సినిమాగా రీసెంట్ గా రిలీజైన ఆర్డీఎక్స్ లవ్ అని చెప్పుకున్నారు జనాలు. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకు రానంత చెత్త రేటింగ్స్ ఈ సినిమాకు వచ్చాయి. క్రిటిక్స్ అయితే ఈ సినిమాను ఏకేసారు. అందరూ 1 లేదా 2 వద్దే తమ రేటింగ్స్ ను ఆపేసారు.

ఇందులోని కంటెంట్ ను, అది తెరకెక్కించిన దర్శకుడ్ని, అందులో నటించిన నటీనటుల్ని ఇలా ఎవర్నీ క్రిటిక్స్ విమర్శించకుండా ఉండలేదు. అయితే ఇవేమీ పాయల్ కు పట్టినట్లు లేదు. సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాను పొగుడుతున్నట్లుగా ఉన్న ఒక పబ్లిక్ టాక్ ను షేర్ చేసింది పాయల్ రాజ్ పుత్. కేవలం షేర్ చేసి ఊరుకుంటే అందులో వింత ఏం ఉంది. దీనికి ఒక భారీ థాంక్యూ నోట్ ను జత చేసింది.

“ఆరెక్స్ 100 తర్వాత ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ చేయడానికి నిజంగా చాలా ఆలోచించాను. నేను ఒక్కదాన్నే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలనా అన్న సందేహం వచ్చింది. అయితే ఆర్డీఎక్స్ లవ్ ద్వారా నేను సాధించగలిగాను. నా నటనను మెచ్చుకుంటున్న వాళ్ళకి కృతఙ్ఞతలు” అంటూ మురిసిపోయింది. చేసిందే ఒక చెత్త సినిమా, మళ్ళీ దానికి ఈ బిల్డప్ లు ఏంటి అంటూ పాయల్ ను మరోసారి తిట్టిపోస్తున్నారు జనాలు.