క‌త్తిప‌ట్టిన `Rx100` బ్యూటీ పాయ‌ల్ ‌!

Payal Rajput Holds Sickle this pic goes viral Rx100
Payal Rajput Holds Sickle this pic goes viral Rx100

`Rx100` చిత్రంతో రెబెల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది పాయ‌ల్ రాజ్‌పుత్. డేరింగ్ హీరోయిన్‌గా ఎలాంటి పాత్ర‌లో అయినా న‌టించ‌గ‌ల‌ద‌ని.. బోల్డ్ పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. దీంతో పాయ‌ల్‌కు ఆ త‌రువాత నుంచి అదే త‌ర‌హా పాత్ర‌లు రావ‌డం మొద‌లైంది. దీంతో త‌న ట్రాక్ మార్చుకోవాల‌ని ప్రయ‌త్నాలు మొద‌లుపెట్టింది.

గ్లామ‌ర్ పాత్ర‌లు కాకుండా డీ గ్లామ‌ర్ పాత్ర‌లు.. న‌ట‌న‌కు ఆస్కారం వున్న పాత్ర‌ల్లో న‌టించాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. తాజాగా పాయ‌ల్ రాజ్‌పుత్ న‌టించిన చిత్రం `అన‌గ‌న‌గ ఓ అతిథి`. చైత‌న్య కృష్ణ హీరోగా న‌టించాడు. ఈ చిత్రం ద్వారా క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ద‌యాళ్‌ ప‌ద్మ‌నాభ‌న్ ద‌ర్శ‌కుడిగా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. ఇదొక‌ పిరియాడిక‌ల్ మూవీ.

సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో ప‌క్కా గ్రీమీణ యువ‌తిగా పాయ‌ల్ రాజ్‌పుత్ న‌టించింది. డీ గ్లామ‌ర్ మేకోవ‌ర్ లో పాయ‌ల్ క‌నిపించింది. తాజాగా ఈ మూవీని ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. మాసీవ్ లుక్‌లో మ‌ల్లిక పాత్ర‌లో క‌త్తి ప‌ట్టి క‌నిపించింది పాయ‌ల్‌. ఈ సినిమాతో తన ట్రాక్‌ని మార్చుకోవాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నం ఏ మేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి. ఈ మూవీ ఈ నెల 20 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది.