జ‌యంత్ సినిమాలో ఆర్టీఎక్స్ బ్యూటీ!జ‌యంత్ సినిమాలో ఆర్టీఎక్స్ బ్యూటీ!
జ‌యంత్ సినిమాలో ఆర్టీఎక్స్ బ్యూటీ!

అజ‌య్ భూప‌తి `ఆర్ ఎక్స్ 100` చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది పాయల్ రాజ్‌పుత్‌. నెగెటివ్ హీరోయిన్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించి తొలి సినిమాతోనే ఔరా అనిపించింది. హ‌ద్దులు దాటి ఎక్స్‌పోజింగ్‌కి రెడీ అంటూ సంకేతాలిచ్చిన పాయ‌ల్‌కు ఆ త‌రువాత కూడా అదే త‌ర‌హా అవ‌కాశాలొచ్చాయి. వెంకీ మామ‌, డిస్కోరాజా చిత్రాల త‌రువాత పాయ‌ల్ మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌ని సొంతం చేసుకుంది.

ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేనా. బావ‌గారు బాగున్నారా వంటి చిత్రాల‌తో సూప‌ర్‌హిట్ చిత్రాల‌ని అందించిన ద‌ర్శ‌కుడు జ‌యంత్‌.సి. ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో `న‌రేంద్ర‌` పేరుతో ఓ సినిమా రూపొందుతోంది.
ఇందులో పాయ‌ల్ రాజ్‌పుత్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఇండియ‌న్ తొలి మ‌హిళా ఫైట‌ర్ పైలెట్‌గా ఆమె పాత్ర చాలా కొత్త‌గా హీరోయిక్‌గా వుండ‌బోతోందిని తెలిసింది. ఓ భార‌తీయ బాక్స‌ర్ పాకిస్థాన్ జైల్లో ఎందుకు మ‌గ్గాడు?. ఆ త‌రువాత అత‌ను ఎలా బ‌య‌టికి వ‌చ్చాడు? అన్నే ఇంట్రెస్టింగ్ స్టోరీ నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` చిత్రంలో న‌టిస్తున్న బ్రెజిలియ‌న్ న‌టి ఇజ‌బెల్లా లిలైతే మాన‌వ హ‌క్కుల కార్య‌క‌ర్త‌గా క‌నిపించ‌బోతోంది. మానవ హక్కుల కార్యకర్త పాత్ర పోషిస్తుంది. అఫ్గ‌న్ ఖైదీని WWE స్టార్ గ్రేట్ ఖ‌లీ న‌టిస్తున్నాడు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.