పాయ‌ల్ రాజ్‌పుత్ జాన్ ఇత‌నే!


పాయ‌ల్ రాజ్‌పుత్ జాన్ ఇత‌నే!
పాయ‌ల్ రాజ్‌పుత్ జాన్ ఇత‌నే!

`RX100` సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది పాయ‌ల్ రాజ్‌పుత్‌. హాట్ హాట్ స‌న్నివేశాల్లో ఈజ్‌తో న‌టించి ఔరా అనిపించింది. ఇందు పాత్ర‌లో అత్యంత స‌హ‌జంగా న‌టించి ఆక‌ట్టుకుంది. ఆ త‌రువాత చేసిన `ఆర్‌డిఎక్స్` చిత్రంలోనూ అలివేలుగా న‌టించి శృంగార పాఠాలు నేర్పించిన పాయ‌ల్‌కు ఓ బాయ్ ఫ్రెండ్ వున్నాడ‌ట‌. అత‌నే త‌న జాన్ అంటూ ఏకంగా సోష్ మీడియా వేదిక‌గా త‌న అభిమానుల‌కు ప‌రిచ‌యం చేసి షాకిచ్చింది.

పాయ‌ల్ బాయ్‌ఫ్రెండ్ పేరు సౌర‌భ్ డింగ్రా. అత‌ను ముంబైలో మోడ‌ల్‌. ఓకానొక సంద‌ర్భంలో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింద‌ట‌. ఇద్ద‌రూ గ‌త కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నారు. ఒక‌రి లోపాల‌ని ఒక‌రు ఇష్ట‌ప‌డుతున్నారు. తాజాగా సౌర‌భ్ పుట్టిన రోజుని పుర‌స్క‌రించుకుని ఇద్ద‌రి మ‌ధ్య వున్న అనుబంధాన్ని పాయ‌ల్ సోష‌ల్‌మీడియా ఇన్‌స్టా వేదిక‌గా బ‌య‌టిపెట్టింది.

త‌న లోపాల‌ని ఇష్ట‌ప‌డే ఏకైక వ్య‌క్తి అంటూ త‌న ప్రియుడి పుట్టిన రోజు వేడుక‌ని త‌న అభిమానుల‌తో క‌లిసి పాయ‌ల్ జ‌రుపుకుంది. దీనికి సంబంధించిన ఫొటోల‌ని పాయ‌ల్ షేర్ చేసింది కూడా. ఆ ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. పాయ‌ల్ ఇంత బోల్డ్ క్యారెక్ట‌ర్‌లు చేస్తున్న ఆమెకు తెలుగులో ఒక్క‌టంటే ఒక్క సినిమా కూడా లేదు. వెంకీ మామ ఫ‌ర‌వాలేద‌నిపించుకున్నా `డిస్కోరాజా` అడ్ర‌స్ లేకుండా పోవ‌డంతో పాయ‌ల్ అవ‌కాశాల కోసం వెతుక్కుంటోంది ప్ర‌స్తుతం త‌మిళంలో `ఏంజిల్‌` పేరుతో రూపొందుతున్న చిత్రంతో న‌టిస్తోంది.