ప్రభాస్ సినిమాలో నటించడం లేదట ఈ భామ


ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రంలో నేను నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ అది నిజం కాదు అంటూ సాహో పై వస్తున్న పుకార్లని ఖండించింది ఆర్ ఎక్స్ 100 హాట్ భామ పాయల్ రాజ్ పుత్ . ఆర్ ఎక్స్ 100 చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది . అడల్ట్ కంటెంట్ నేపథ్యంలో ఆ చిత్రంలో బోల్డ్ గా నటించి సంచలనం సృష్టించింది పాయల్ రాజ్ పుత్ . అయితే ఈ భామ తాజాగా సాహో చిత్రంలో ఐటెం సాంగ్ చేయనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి , అవి పాయల్ చెవిన పడటంతో ఆ వార్తలు నిజం కాదని తేల్చి చెప్పింది .

పాయల్ రాజ్ పుత్ కు ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ వచ్చిందంటే ఈ భామ రేంజ్ అనూహ్యంగా పెరిగినట్లే అని అనుకున్నారు కానీ సాహో లో ఐటెం సాంగ్ చేయడం లేదని చెప్పింది కాబట్టి ఇంకా ఈ భామ రేంజ్ ఎప్పుడు మారుతుందో . ప్రస్తుతానికి ఈ కుర్ర భామ ముదురు హీరోలైన వెంకటేష్ , రవితేజ ల సరసన నటిస్తోంది పాపం .