హీరోయిన్ గా కాదు.. స్పెషల్ సాంగ్ లో బోల్డ్ బ్యూటీ

Payal Rajput
Payal Rajput

ఆరెక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లో సంచలన ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. ఆ తర్వాత కొంచెం గ్యాప్ వస్తున్నట్లు కనిపించినా పాయల్ బిజీగానే ఉంది. డిస్కో రాజా చిత్రంలో రవితేజ సరసన ఒక హీరోయిన్ గా నటిస్తోంది.

ఆమె ప్రధాన పాత్రలో మరో బోల్డ్ చిత్రం ఆర్డీఎక్స్ లవ్ అక్టోబర్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇవి కాకుండా మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

అన్నట్టు ఈ భామ ఈ ఏడాది విడుదలైన సీత చిత్రంలో ఒక ఐటెం నెంబర్ లో నర్తించిన విషయం తెల్సిందే. గ్లామర్ పరంగా అమ్మడికి మంచి కామెంట్సే వచ్చాయి. అయితే తేజ తీయబోయే తర్వాతి చిత్రంలో పాయల్ మెయిన్ హీరోయిన్ గా ఎంపికైందంటూ ఈ మధ్య వార్తలు వచ్చాయి.

తాజా సమాచారం ప్రకారం ఇది హీరోయిన్ పాత్ర కాదని, ఇందులో కూడా స్పెషల్ సాంగ్ కే పాయల్ ను ఎంపిక చేసారని, మరికొన్ని రోజులు ఆగితే ఫుల్ క్లారిటీ వస్తుందని అంటున్నారు. అది స్పెషల్ సాంగ్ అయినా, హీరోయిన్ అయినా పాయల్ సైడ్ నుండి నో వర్రీస్ అని తెలుస్తోంది.