ఫొటోస్టోరీ: పాయ‌ల్ సొగ‌సు చూడ‌త‌ర‌మా


Payal Rajput
Payal Rajput

చిన్న చిత్రాల్లో పెద్ద విజ‌యాన్ని సాధించి సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం `ఆర్ ఎక్స్ 100`. ఈ సినిమాతో నెగెటివ్ షేడ్స్ వున్న క‌థానాయిక‌గా తెరంగేట్రం చేసింది పంజాబీ సోయ‌గం పాయ‌ల్ రాజ్‌పుత్‌. చ‌న్నా మేరెయా, వేరేకీ వెడ్డింగ్ చిత్రాల‌తో పంజాబీ ఇండ‌స్ట్రీ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నించినా పాయ‌ల్‌కు ఆశించిన గుర్తింపు లభించ‌లేదు. దీంతో టాలీవుడ్ బాటప‌ట్టిన ఆమెకు  `ఆర్ ఎక్స్ 100` తెలుగులో తిరుగులేని ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. అయితే హాట్ హీరోయిన్‌గా క్రేజ్‌ని సొంతం చేసుకున్న పాయ‌ల్ అందుకు భిన్న‌మైన ఇమేజ్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

`ఆర్ డీఎక్స్‌` సినిమాలో రెచ్చిపోయి న‌టించి మ‌ళ్లీ అదే బాట‌ప‌ట్టిన ఆమెకు వ‌రుస‌గా అదే త‌ర‌హా ఆఫ‌ర్‌లు వ‌స్తున్నాయ‌ట‌. తాజాగా విక్ట‌రీ వెంక‌టేష్‌తో క‌లిసి `వెంకీమామ‌`, మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో క‌లిసి `డిస్కోరాజా` చిత్రాల్లో న‌టిస్తోంది. ఈ రెండు చిత్రాల్లో విక్ట‌రి వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య క‌లిసి న‌టించిన `వెంకీ మామ‌` ఈ నెల 13న విడుద‌ల‌వుతోంది. ర‌వితేజ‌తో న‌టిస్తున్న `డిస్కోరాజా` జ‌న‌వ‌రి 24న రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ రెండు చిత్రాల ద్వారా త‌న పంథాను మార్చుకోవాల‌ని, త‌న‌పై ప‌డిన హాట్ భామ మార్కుని చెరిపేసుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కానీ ఏదీ క‌లిసి వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు.

`ఆర్ ఎక్స్ 100` సినిమాలో పోషించిన పాత్ర ఇంపాక్ట్ ఏ మాత్రం త‌గ్గ‌క‌పోవ‌డం, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కూడా పాయ‌ల్‌కు అదే త‌ర‌హా పాత్ర‌ల్ని ఆఫ‌ర్ చేస్తుండ‌టంతో చేసేది లేక పాయ‌ల్ మ‌ళ్లీ అదే బాట‌ప‌డుతోంది. ఇందులో భాగంగానే సోష‌ల్ మీడియా ఇన్‌స్టాలో ఫ్యాన్స్ కోసం హాట్ హాట్ ఫొటోల‌తో ర‌చ్చ చేయ‌డం మొద‌లుపెటట్టింది. తాజాగా పాయ‌ల్ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. పాయ‌ల్ త‌న అందాలొలికిస్తూ ఫొటోల‌కు పోజిచ్చిన ఫొటో చూసిన అభిమానులంతా పాయ‌ల్ సొగ‌సుచూడ త‌ర‌మా అని మురిసిపోతున్నారు.

 

View this post on Instagram

 

The perfect ones are always flawed ? . Lensed by @i_ak_photographer ?

A post shared by Payal Rajput (@rajputpaayal) on