సీనియర్ హీరోలతో రొమాన్స్ కి సై అంటున్న పాయల్


 Payal rajput ready to romance with old heroes

సీనియర్ హీరోలతో రొమాన్స్ చేయడానికి సిద్ధమైంది హాట్ భామ పాయల్ రాజ్ పుత్ . ఆర్ ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన భామ పాయల్ రాజ్ పుత్ . ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ భామకు అవకాశాలు బాగానే వస్తున్నాయి అయితే వస్తున్న సినిమాలన్నీ ఒప్పుకోకుండా సెలెక్టివ్ గా చేస్తోంది . ఇప్పటికే కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకున్న ఈ భామ తాజాగా సీనియర్ హీరోలు అయిన నాగార్జున , వెంకటేష్ లతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది .

 

నాగార్జున హీరోగా మన్మధుడు 2 చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే కాగా ఆ చిత్రంలో నాగార్జున రొమాన్స్ చేయడానికి ఒప్పుకుంది పాయల్ , ఇక తాజాగా మరో సీనియర్ హీరో వెంకటేష్ సరసన కూడా నటించడానికి ఒప్పుకుంది . వెంకీ మామ అనే చిత్రంలో వెంకటేష్ తో రొమాన్స్ చేయనుంది పాయల్ రాజ్ పుత్ . మొత్తానికి కుర్ర హీరోలతో మాత్రమే కాకుండా సీనియర్ హీరోలతో కూడా రొమాన్స్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తోంది అన్నమాట పాయల్ రాజ్ పుత్ .

English Title: Payal rajput ready to romance with old heroes