ముగ్గురు హీరోలను రిజెక్ట్ చేసిన ఆర్ ఎక్స్ 100 హీరోయిన్


 Payal Rajput rejects Ram Charan , akhil and bellamkonda sai srinivas

ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు హీరోల సరసన నటించే ఛాన్స్ వస్తే ఏమాత్రం మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసి సంచలనం సృష్టించింది ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ . గత నెలలో విడుదలైన ఆర్ ఎక్స్ 100 చిత్రం సంచలన విజయం సాధించడంతో ఒక్కసారిగా పాయల్ రాజ్ పుత్ హాట్ హీరోయిన్ అయ్యింది . దాంతో అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి . అయితే వస్తున్న అన్ని ఆఫర్ల ని కాదంటోంది పాయల్ రాజ్ పుత్ . ఈ భామ రిజెక్ట్ చేసిన హీరోలలో అగ్ర హీరో రామ్ చరణ్ కూడా ఉన్నాడు .

చరణ్ సరసన నటించే ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేయడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ తాజాగా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే , కాగా ఆ సినిమాలో ఐటెం సాంగ్ చేయమని పాయల్ రాజ్ పుత్ ని అడిగారట కానీ నిర్మొహమాటంగా నో అని చెప్పిందట . అంతేకాదు అఖిల్ సినిమాలో కూడా నటించమని కోరితే ఆ సినిమాలో కూడా నటించనని చెప్పిందట ! అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాని సైతం రిజెక్ట్ చేసిందట పాయల్ రాజ్ పుత్ . అంటే మొత్తం మీద ముగ్గురు హీరోలను రిజెక్ట్ చేసి సంచలనం సృష్టించింది ఈ భామ . ఛాన్స్ ల కోసం చాలామంది హీరోయిన్ లు ఎగబడుతుంటే ఈ భామ మాత్రం వస్తున్న అవకాశాలను తిరస్కరిస్తూ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతోంది

English Title:  payal rajput rejects ram Charan , akhil and bellamkonda sai srinivas